సాక్షి, బళ్లారి: తుంగ్రభద్ర జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు నెల ప్రారంభం నుంచి భారీ ఎత్తున ఇన్‌ఫ్లో చేరుతుండటంతో డ్యాంలో ప్రస్తుతం 70 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో కూడా 45 వేల క్యూసెక్కులు ఉండటంతో త్వరలో 80 టీఎంసీలు చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సాగు, తాగు నీటి విడుదలపై నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 11వ తేదీన కొప్పళ జిల్లా మునిరాబాద్ వద్ద తుంగ్రభద్ర నీటి సలహా సమితి (ఐసీసీ) సమావేశం నిర్వహించనున్నారు. ఖరీఫ్‌కు నీరు విడుదల చేసే విషయంపై చర్చించనున్నారు. తుంగభద్ర నీటి పారుదల సలహా సమితి అధ్యక్షుడు, స్థానిక మంత్రి శివరాజ్ తంగడిగి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. నాలుగు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రైతు సంఘం నేతలు హాజరై తమ సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. ఖరీఫ్‌లో పంటల సాగుకు నీటి విడుదలపై ప్రముఖంగా చర్చించనున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేసే అవకాశం ఉండటంతో సంతోషం వ్యక్తం అవుతోంది.
నీటి విడుదలకు
ఈనెల 11న ఐసీసీ సమావేశం


