రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో సరైన వానలు కురవనందున తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చర్యలు చేపట్టాలని యాదగిరి జిల్లా ఇంచార్జి, రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం యాదగిరి జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఖరీఫ్‌లో ముందుగానే వానలు కురిసినందున, రైతులు విత్తనాలు వేయడం వల్ల పంట నష్టం విషయంలో అధికారులు రైతులకు సహకరించాలన్నారు. భవిష్యత్తులో పశువులకు గ్రాసం కొరత రాకుండా చూడాలని సూచించారు. రైతులకు పంటల బీమా పాలసీలు చేయడానికి అవకాశం కల్పించాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే సబ్సిడీ పథకాలను రైతులకు అందించాలన్నారు. గురుమఠకల్ శాసన సభ్యుడు శరణే గౌడ మాట్లాడుతూ కడేచూరు బాడియాళ పరిశ్రమల కేంద్రంలో ముగ్గురు దుర్మరణం పాలైన విషయాన్ని మంత్రి పాటిల్ దృష్టికి తెచ్చారు. యాదగిరి జిల్లాలో విషపూరిత పరిశ్రమలు ప్రారంభించ కూడదని అసెంబ్లీ సమావేశాల్లో చర్చించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. మనుషుల ప్రాణాలను హరించే పరిశ్రమల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు వేణు గోపాల్ నాయక్, శరణ బసప్ప దర్శనాపూర్, చెన్నారెడ్డి తనూర్, జిల్లాధికారి రాహుల్ తుకారాం పాండే, జెడ్పీ సీఈఓ లవీష్ ఒడెయర్, ఎస్పీ పృథ్వీశంకర్‌లున్నారు.
అధికారులకు మంత్రి సూచన


