తుంగభద్ర కాలువ గట్టు పరిశీలన | - | Sakshi
Sakshi News home page

తుంగభద్ర కాలువ గట్టు పరిశీలన

Aug 6 2026 2:26 AM | Updated on Aug 6 2026 2:26 AM

రాయచూరు రూరల్‌: తుంగభద్ర ఎడమ కాలువకు ఇరువైపుల కుదించుకు పోయిన గట్లను బుధవారం మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప, మాజీ మంత్రి వెంకట్రావ్‌ నాడగౌడ పరిశీలించారు. కాలువ గట్టుపై మట్టి కుదించుకుని పోయింది. దీంతో ఆయకట్టు చివరి భూములకు నీరందడం కష్టంగా మారింది. రాయచూరు, కొప్పళ జిల్లాల మధ్య గల మైలాపుర, దుర్గా క్యాంపుల వద్ద కాంక్రీట్‌ సిమెంట్‌ కుదించుకుపోయి ఏడాది గడుస్తున్నా అధికారులు మరమ్మతులు చేపట్టక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వెంట దొడ్డ బసవరాజ్‌, వీరోజీ మరాఠి, మంజు హొసమనిలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement