బళ్లారి రూరల్: నోటిని శభ్రంగా ఉంచుకోవడం ద్వారా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయని బళ్లారి దంత వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భారతి తెలిపారు. దంత వైద్యకళాశాల, పెరియోడాంట్రిక్స్, బీఎంసీఆర్‌సీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఓరల్‌హైజిన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నోటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల దంతాలు, చిగుళ్లు, ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు. నోరు దుర్వాసన రాకుండా ఉంటుందని పేర్కొన్నారు. దంతాలు చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటే ముఖంలో మార్పులకు ఆస్కారం ఉండదన్నారు. కార్యక్రమంలో బీఎంసీఆర్‌సీ డీన్, డైరెక్టర్ డాక్టర్ గంగాధరగౌడ, దంత వైద్యకళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ దివాకర్, బీఎంసీఆర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇందుమతి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.మల్లికార్జున, కళాశాల వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.


