హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరందించే ప్రధాన జలాశయం తుంగభద్ర డ్యాంకు ఎగువన ఉన్న మల్నాడు ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తుంగభద్ర జలాశయంలోకి నీటి ప్రవాహం(ఇన్‌ఫ్లో) పెరిగింది. ఆదివారం నీటి నిల్వ 40.80 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం డ్యాంలోకి 25,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా, గాజనూరులోని తుంగా డ్యాం నుండి అదనపు నీటిని విడుదల చేయడంతో రెండు రోజుల్లో ఈ ప్రవాహం 50,000 క్యూసెక్కులను దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయనగర జిల్లా హువినహడగలి తాలూకాలోని సింగటాలూరు బ్యారేజీ నుంచి తుంగభద్ర నదిలోకి అదనపు నీటిని విడుదల చేస్తున్నారు. నదీ తీరంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లాధికారిణి కవిత మన్నికేరి తెలిపారు.
40 టీఎంసీలకు పైగా చేరిన నీటి నిల్వ


