రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో దానం చేయాలనే తపన అందరిలో కలగాలని ఆర్య వైశ్య సమాజం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి మహాస్వామీజీ పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి నగరంలోని అర్య వైశ్య నగరేశ్వర ఆలయంలో ఆర్య వైశ్య సమాజం, ఆర్య వైశ్య మహాసభల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి ప్రసంగించారు. ఆర్య వైశ్య సమాజం పీఠాధిపతిగా అధికారం చేపట్టిన సచ్చిదానంద సరస్వతి మహాస్వామి ఐదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం ముదావహమన్నారు. పూర్ణ కుంభాలతో స్వామీజీని ఊరేగించారు. మహిళల సహకారంతో వాసవి మాతకు శతకంఠ గాయన కార్యక్రమాలు చేపట్టారు. సమావేశంలో ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు రవిశంకర్, కుంటనాళ వెంకటేష్, పురుషోత్తం, జగదీశ్ గుప్త, రవి కుమార్, వాసుదేవ్, హన్మంతయ్య, సాయిరాం, మూర్తి, పద్మరాజ్, మంజుల, వీరేష్, రాకేష్ రాజలబండి తదితరు పాల్గొన్నారు.


