రాయచూరు రూరల్: సమాజంలో మానవుడు విద్య, వైద్య, ఆరోగ్య తదితర రంగాల్లో పరిణితిని సాధించాలని లోక్‌సభ సభ్యుడు జీ.కుమార నాయక్ పిలుపునిచ్చారు. శనివారం నవోదయ వైద్య కళాశాలలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాయచూరు ఇంపాక్ట్– 2026 జిల్లా స్థాయి వివిధ అంశాలపై జరిగిన సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. కళ్యాణ కర్ణాటకలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ పథకాల అమలుకు ప్రైవేట్ వారి భాగస్వామ్యం అవసరమన్నారు. తాగునీరు, వృత్తిపర విద్యా విధానం, మౌలిక సౌకర్యాలు, విద్య, వైద్యకీయ, ఆరోగ్య రంగంలో ప్రావీణ్యతను సాధించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, యువతకు ఉద్యోగ భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధికి కంకణ బద్ధులు కావాలన్నారు. సమావేశంలో మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్, జిల్లాధికారి పూవిత, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, సిటీ కార్పొరేషన్ కమిషనర్ జుబిన్ మహా పాత్రో, జిల్లా ఆరోగ్య అధికారిణి నందిత, నవోదయ వైద్య కళాశాల రిజిస్ట్రార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


