కరువుపై అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

కరువుపై అలసత్వం వద్దు

Jul 20 2026 12:56 AM | Updated on Jul 20 2026 12:56 AM

ఆదివారం బెంగళూరు విధానసౌధలో సీఎం, మంత్రుల సమావేశం

మండ్య కేఆర్‌ఎస్‌ డ్యాంలో అంతంతమాత్రంగా జలం

శివాజీనగర: రాష్ట్రంలో నెలకొన్న కరువు పట్ల ఉదాసీనంగా ఉండవద్దని, పరిష్కార చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌ అధికారులను ఆదేశించారు. ప్రజలు నీటి కోసం తిరగకుండా నివారించేందుకు తాగునీరు, పశువులకు పశుగ్రాసం అందించాలని సూచించారు. రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితి, తాగునీరు, పశువుల దాణా కొరత, కూలీలకు ఉపాధి వంటి అంశాలపై ఆదివారం విధానసౌధలో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, జడ్పీ సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీఎం ప్రసంగిస్తూ 60 శాతం వర్షపాతం లోటు ఉంది. 178 తాలూకాలలో సరైన వర్షాలు లేవు అని తెలిపారు. వర్షపాతం, డ్యాంలలో నిల్వ ఉన్న నీటి ఆధారంగా వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగాలి, కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు రైతులతో సంప్రదింపులు జరుపుతూ వారికి మార్గనిర్దేశం చేయాలని సీఎం ఆదేశించారు. తాను కల్బుర్గి, బెళగావిలో పర్యటించగా, పంటల బీమాలలో అక్రమాల ఆరోపణలు వచ్చాయని ఆయన తెలిపారు. దీనిపై ప్రత్యేక నివేదిక కోరానన్నారు.

సరైన నివేదికలు ఇవ్వాలి

కరువును ఎదుర్కోవడానికి ప్రభుత్వం నిధులను, సౌకర్యాలను కల్పిస్తోంది, అయినప్పటికీ, విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఏ జిల్లాలోనైనా విపత్తు సంభవిస్తే, దానికి వారే బాధ్యత వహిస్తారని అధికారులను హెచ్చరించారు. పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు చురుకుగా, సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. కాగితంపై నివేదిక ఇస్తే తాను వినను, క్షేత్రస్థాయి నివేదిక ముఖ్యం, తాను తెప్పించుకునే నివేదికకు, మీరు ఇచ్చే నివేదికకూ మధ్య ఎలాంటి తేడా ఉండకూడదని సీఎం తెలిపారు. 15 రోజుల్లో కరువుపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి, కలెక్టర్లు, సీఈఓలు సత్వరమే సమగ్ర సమాచారాన్ని సేకరించి పంపాలని సీఎం ఆదేశించారు. నేతలకు, అధికారులకు ఆదివారం, సెలవు దినాలు ఉండవని, ప్రతిరోజూ పనిచేయాలని అన్నారు.

బోర్లలో మోసాలు చేయొద్దు

గ్రామాలలో తాగునీటి కోసం తవ్వే కొత్త బోర్లను వీడియో తీసి పంపాలి, ఉత్తుత్తి మాటలను నమ్మేది లేదన్నారు. బోరు వేయకున్నా వేసినట్లు బూటకపు రుజువులు చూపితే జడ్పీ సీఈఓదే బాధ్యత అని, అలా జరగనివ్వవద్దని స్పష్టంచేశారు. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మత్తులపై దృష్టి పెట్టండి. అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను సిద్ధం చేయండి అని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ సీఎం జీ.పరమేశ్వర్‌, మంత్రులు కే.జే.జార్జ్‌, రామలింగారెడ్డి, ఈశ్వర ఖండ్రె, యతీంద్ర, సీఎస్‌ శాలినీ రజనీశ్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తక్షణం పరిష్కార చర్యలు చేపట్టండి

కలెక్టర్లు, జడ్పీ సీఈఓలకు సీఎం

శివకుమార్‌ ఆదేశం

విధానసౌధలో ప్రత్యేక సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement