రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా దేవసూగూరులో వీధి కుక్కల దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. శనివారం గ్రామ పంచాయతీ పరిధిలోని వివిధ వార్డుల్లో వీధి కుక్కలు కరవడంతో అంజిరెడ్డి, నాగవేణి, రాజశేఖర్ తో పాటు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గ్రామ పంచాయతీ, జిల్లా పాలన యంత్రాంగం కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడాన్ని గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు. కాగా జిల్లాలోని సింధనూరులో రెండు రోజుల క్రితం రెండేళ్ల పసి కందు కుక్కల దాడిలో మరణించిన సంగతి విదితమే.
గాయపడ్డ అంజిరెడ్డి , నాగవేణి, రాజశేఖర్
శునకాల దాడిలో
నలుగురికి తీవ్ర గాయాలు
రాయచూరు జిల్లా
దేవసూగూరులో ఘటనలు


