బిడది టౌన్‌షిప్‌పై గడబిడ | - | Sakshi
Sakshi News home page

బిడది టౌన్‌షిప్‌పై గడబిడ

Jul 15 2026 1:22 AM | Updated on Jul 15 2026 1:22 AM

సోమవారం అధికారులపై రైతుల దాడి దృశ్యం

మంగళవారం ధర్నా చేస్తున్న మహిళా రైతులు

దొడ్డబళ్లాపురం: ప్రభుత్వ బిడది టౌన్‌షిప్‌ వ్యతిరేక పోరాటం పతాకస్థాయికి చేరింది. సోమవారం నాడు మండలహళ్లిలో సర్వే చేయడానికి వచ్చిన అధికారులను గ్రామస్తులు తరిమికొట్టడం తెలిసిందే. ఇందులో ముగ్గురు పోలీసులు, ఒక రైతు గాయపడ్డారు. మంగళవారంనాడు మహిళా రైతులు టౌన్‌షిన్‌ను వ్యతిరేకిస్తూ భైరమంగలలో రోకళ్లు, పురుగుల మందు బాటిళ్లు చేతబట్టి ధర్నా సాగించారు. మరోవైపు వందలాది మంది రైతులు సమీపంలోనే టౌన్‌షిప్‌ కావాలంటూ రాస్తారోకో చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవలు జరగవచ్చనే ఆందోళన నెలకొంది.

20 మంది రైతులపై కేసులు

అధికారులపై దాడి ఘటనలో 20 మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బాధిత అధికారులు బిడది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో అరెస్టు భయం నెలకొంది.

రద్దు చేయాలి: నిఖిల్‌

బనశంకరి: రైతులపై పెట్టిన కేసులు 48 గంటల్లోగా రద్దుచేయాలి, అదుపులోకి తీసుకున్న అమాయకులను తక్షణం విడుదల చేయాలని జేడీఎస్‌ యువజన నేత నిఖిల్‌ కుమారస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్స్‌లో డిమాండ్‌ చేశారు. లేదంటే పోరాటం చేస్తామన్నారు. రైతుల భూమిలోకి చొరబడి సర్వేచేయడానికి ప్రయత్నించడం తగదన్నారు.

అధికారులపై దాడి ఘటనలో

20 మందిపై కేసులు

మహిళా రైతుల నిరసన

మాజీ ప్రధాని దేవేగౌడ మద్దతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement