ఏఐ యూనివర్సిటీని స్థాపిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఏఐ యూనివర్సిటీని స్థాపిస్తాం

Jul 15 2026 1:22 AM | Updated on Jul 15 2026 1:22 AM

బనశంకరి: భారతదేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ ఏఐ యూనివర్శిటీని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌ ప్రకటించారు. మంగళవారం బెంగళూరులోని అంతర్జాతీయ వస్తుప్రదర్శన కేంద్రంలో గూగుల్‌ ఐ–ఓ కనెక్ట్‌ సదస్సులో సీఎం ప్రసంగించారు. కర్ణాటక ను ఏఐ–నేటివ్‌ రాష్ట్రంగా రూపొందించడం, పరిపాలన, ప్రజా సేవలు అందించడంలో ఏఐకి పెద్దపీట వేస్తామన్నారు. ఏఐ ప్రతిభావంతులను తీర్చిదిద్దడం, పరిశోధనలు ప్రోత్సహించడం, విద్యాసంస్థలు, పారిశ్రామికరంగం, ప్రభుత్వం మధ్య సహకారం పెంపొందించడానికి ఏఐ యూనివర్శిటీని ఏర్పాటుచేస్తామని తెలిపారు. బెంగళూరులో సాంకేతిక పరిజ్ఞానం అనేది నిత్యజీవితంలో భాగమైంది అని చెప్పారు.

40 శాతం ఐటీ ఎగుమతులు

భారత ఐటీ ఎగుమతుల్లో కర్ణాటక 40 శాతం ఉందన్నారు. బెంగళూరు 17 వేలకు పైగా స్టార్టప్‌లకు నిలయం. దీంతో భారత స్టార్టప్‌ రాజధానిగా మారిందన్నారు. భారత్‌లో గూగుల్‌లో 18 వేల సిబ్బంది ఉండగా, అందులో 12 వేలమంది సిబ్బంది బెంగళూరులోనే ఉన్నారన్నారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా బెంగళూరు ట్రాఫిక్‌ సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.

పరిపాలనలో ఏఐ వినియోగం

గూగుల్‌ సదస్సులో సీఎం డీకే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement