కరువు జిల్లాగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

కరువు జిల్లాగా ప్రకటించాలి

Jul 15 2026 1:22 AM | Updated on Jul 15 2026 1:22 AM

కోలారు: కోలారును కరువు జిల్లాగా ప్రకటించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం బంగారుపేట ఆస్పత్రి సర్కిల్‌ వద్ద ఆందోళన చేపట్టారు. రైతు నేత కె.నారాయణ గౌడ మాట్లాడుతూ.. ప్రభుత్వం మూడు రోజుల్లోపు కోలారును కరువు జిల్లాగా ప్రకటించి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరారు. నిత్యావసర ధరలు పెరిగి పోయాయని తెలిపారు. టమాట, మామిడి ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలన్నారు. సమస్యలపై స్పందించకుంటే ముఖ్యమంత్రిని టమాటాలతో అడ్డుకుంటామన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ హుచ్చప్పకు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement