ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నెట్టుకురావాల్సిన జీవితాన్ని కొ
మానసిక సమస్యల పాపం
● నిమ్హాన్స్ సంస్థ విశ్లేషణ ప్రకారం బాధితుల్లో మూడోవంతు మానసిక రోగాలతో బాధపడేవారే. మిగిలిన రెండు భాగాల మంది ఆర్థిక సమస్యలు, కుటుంబంలో బాంధవ్యాలను కోల్పోవడంతో వ్యథచెంది తనువు చాలిస్తున్నారు.
● గతంలో ఆత్మహత్యకు దోహదంచేసే క్రిమిసంహారక మందులతో పాటు విషపూరిత సాధనాలు సులభంగా లభించేవి కావని మానసిక వైద్యనిపుణుడు డాక్టర్ బీఎన్. రవీశ్ చెప్పారు.
మానసిక ఒత్తిళ్లతోనూ బలవన్మరణాలు
టెలిమనస్ సహాయం
బనశంకరి: ఎంతో విలువైన జీవితం మధ్యలోనే కడతేరిపోతోంది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ గొడవలు, నిరుద్యోగం, అనారోగ్యం.. ఇలా ఎన్నో కారణాల వల్ల బెంగళూరు నగరంలో ఆత్మహత్యల సంఖ్య విస్తరిస్తోంది. గత నాలుగేళ్లలో 9,450 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ప్రతిరోజు సరాసరి 6 లేదా 7 మంది ఆత్మహత్యకు ఒడిగడుతున్నారు. మానసిక అనారోగ్యాలు కూడా బలవన్మరణాలకు కారణం అవుతున్నాయి.
ఏటా 2 వేల మంది..
రాష్ట్ర హోంశాఖ తెలిపిన సమాచారం ప్రకారం బెంగళూరు లో ప్రతి ఏటా 2 వేల మంది ఆత్మహత్యతో అకాల మృత్యువాత పడుతున్నారు.
భవనాల పై నుంచి దూకడం, ఉరివేసుకోవడం, పురుగుల మందు తాగడం, రైలు కింద పడడం, తుపాకీతో కాల్చుకోవడం తదితర మార్గాల్లో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నారు.
వీరిలో ఎక్కువమంది యువత కావడం మరింత విషాదకరం.
2022 జనవరి నుంచి 2025 నవంబరు వరకు ఆత్మహత్యకు పాల్పడిన 9,450 మందిలో 8,148 మంది ఉరివేసుకున్నారు. 740 మంది విషం తాగి చనిపోగా 204 మంది ఎత్తైన కట్టడాల నుంచి దూకారు.
2022లో 2,313 మంది, 2023లో 2,370 మంది, 2024లో 2,403 మంది, 2025 నవంబరు నాటికి 2,364 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నిమ్హాన్స్ ప్రారంభించిన టెలిమనస్ సహాయవాణికి (14416) ప్రతినిత్యం వేలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మానసిక కల్లోలంతో కాల్ చేస్తున్నారు. మానసికంగా దృఢంగా ఉండాలని వారికి కౌన్సిలింగ్ ఇస్తుంటారు.
2022 అక్టోబరులో ఆరంభించిన టెలిమనస్‌కు ఇప్పటివరకు 30 లక్షల మందికి పైగా కాల్ చేశారు. ఇందులో ఎక్కువమంది 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు ఉన్నారు. దుఃఖం, భయం, పెళ్లి, ఆర్థిక ఇబ్బందుల గురించి, పరీక్షల ఒత్తిడి మీద ఫిర్యాదు చేశారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అండగా నిలిచినట్లు టెలిమనస్ చీఫ్ అర్చనా కార్తీక్ తెలిపారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నెట్టుకురావాల్సిన జీవితాన్ని కొ


