
అంబరం.. నిమజ్జన సంబరం
రాయచూరు: ఊరేగింపులో వరుసగా వెళ్తున్న వినాయక ప్రతిమలు
హొసపేటె: కనువిందుగా గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపు
హొసపేటె: గణేష్ నిమజ్జన ఊరేగింపులో యువత చిందులు
హొసపేటె: వినాయక చతుర్థి వేడుకల తర్వాత ఐదవ రోజు ఆదివారం రాత్రి నగరంలో జరిగిన గణేష్ నిమజ్జన ఊరేగింపునకు యువత ప్రత్యేక ఆకర్షణ కల్పించారు. పండుగ ఉత్సాహంలో వివిధ డీజే శబ్దాలకు చిందులు వేసిన యువ భక్తులు గణపతి బప్పా మోరియా, గణేష్‌నిగె జై వంటి నినాదాలతో మొత్తం వాతావరణాన్ని ఉత్సాహపరిచారు. ఊరేగింపులో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వివిధ ఆకృతుల్లో ఊరేగిస్తున్న గణేష్ విగ్రహాలను చూడటానికి ప్రజలు రోడ్డు పక్కన నిలబడ్డారు. గణేష్ విగ్రహ ఊరేగింపు జరుగుతున్న అన్ని ప్రధాన రహదారులు కిక్కిరిసి పోయాయి. యువకులు తమ ప్రత్యేకమైన నృత్యాలతో చూపరుల దృష్టిని ఆకర్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, నిమజ్జనం సజావుగా జరిగేలా పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఊరేగింపు మొత్తం సీసీ టీవీ కెమెరాల నిఘాలో ఉంది. ప్రతి విగ్రహంపై ఒక కంట్రోల్ యూనిట్‌తో పాటు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. కుండపోత వర్షంలో కూడా పెద్ద జనసమూహాన్ని, డీజే శబ్దాన్ని నియంత్రించడానికి పోలీసులు చాలా కష్టపడ్డారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి వాహన సంచారాన్ని మళ్లించారు. యువత ఉత్సాహంతో ఉరక లేసినప్పటికీ పోలీసులు శాంతి భద్రతలను కాపాడగలిగారు. నిమజ్జనం రాత్రి పొద్దుపోయే వరకు ప్రశాంతంగా జరిగింది.
రాయచూరులో..
రాయచూరు రూరల్: నగరంలో వైభవంగా ఐదవ రోజు వినాయక నిమజ్జనాలు జరిగాయి. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమైన వినాయక విగ్రహాల ఊరేగింపు సోమవారం 11 గంటల వరకు కొనసాగింది. తీన్ కందీల్ నుంచి సూపర్ మార్కెట్, మహావీర్ చౌక్, మహాబలేశ్వర చౌక్, షరాఫ్ బజార్, పేట్లా బురుజు మీదుగా ఖాస్ బావి వరకు డీజే శబ్దాలతో నృత్యం చేస్తూ 95 గణనాథ విగ్రహాలను నిమజ్జనం చేశారు. కాగా వినాయక నిమజ్జన ఊరేగింపు మేదరవాడిలో వెళుతుండగా యువకుల గుంపుల మధ్య స్వల్ప గొడవలు చెలరేగాయి. పోలీసులు యువకుల గుంపులను చెదరగొట్టడానికి లఘు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల కంట్లో కారం చల్లారు. అధికంగా గణనాథుల విగ్రహాలు ఊరేగింపులో పాల్గొనగా మెల్లగా వెళుతున్న గణనాథులను త్వరత్వరగా పంపాలని డిమాండ్ చేసినందుకు రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైందని ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు.
రాయచూరులో ఘర్షణ పడుతున్న
ఇరు వర్గాల యువకులు
రాయచూరులోని ఖాస్‌బావిలో
వినాయక నిమిజ్జనం చేస్తున్న దృశ్యం
హోరెత్తిన జైజై గణేష్ నినాదాలు
ఉత్సాహంతో యువత చిందులు
గుండెపోటుతో యువకుడు మృతి
గణేష్ నిమజ్జన వేళలో అపశ్రుతి దొర్లింది. రాయచూరులో ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన జరిగింది. ఆదివారం రాత్రి నగరంలో యువకుల బృందం గణేష్ నిమజ్జనం కోసం ఖాస్‌బావికి విగ్రహంతో ఊరేగింపుగా వెళుతుండగా రాత్రంతా కేరింతలు పెట్టిన అబిషేక్(26) అనే యువకుడు డీజే శబ్దం అధికం కావడంతో సోమవారం తెల్లవారు జామున కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మరణించాడు.

అంబరం.. నిమజ్జన సంబరం

అంబరం.. నిమజ్జన సంబరం

అంబరం.. నిమజ్జన సంబరం

అంబరం.. నిమజ్జన సంబరం

అంబరం.. నిమజ్జన సంబరం