
పునఃప్రారంభం అనుమానమే
కోలారు ఎంపీ మల్లేష్‌బాబు
కేజీఎఫ్: కోలారు జిల్లాలోని ప్రఖ్యాత కోలారు గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) గనుల పునఃప్రారంభంపై స్థానిక ఎంపీ చేదు కబురు చెప్పారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన బిజిఎంఎల్ సంస్థ పునః ప్రారంభం అనుమానమేనని కోలారు ఎంపీ ఎం.మల్లేష్ బాబు తెలిపారు. బుధవారం ఉరిగాంలో స్వర్ణభవన కార్యాలయాన్ని సందర్శించి విలేకరులతో మాట్లాడారు.
బిజిఎంఎల్ భాగంలో ఇంకా బంగారు నిక్షేపాలు ఉన్నాయా అనేదానిని సర్వే చేయడానికి ప్రైవేటు ఏజెన్సీకి కాంట్రాక్టు ఇచ్చారు, సర్వే చేసిన ఆ ఏజెన్సీ ఇక్కడ ఎలాంటి బంగారు నిక్షేపాలు లేవని నివేదిక సమరి్పంచింది. అందువల్ల బిజిఎంల్ సంస్థ పునః ప్రారంభం కావడం అనుమానమేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ గనులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినా పునః తవ్వకాలు సాధ్యం కాదు.
సైనైడ్ దిబ్బల వేలం..
అయితే గతంలో కేజీఎఫ్‌లో గనుల నుంచి తవ్వి తీసిన సైనైడ్ మట్టి దిబ్బల వేలం ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. రెండు నెలల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, కుమారస్వామిలు కేజీఎఫ్‌కు వచ్చి, పునరావాస పథకం కింద గని కారి్మకులకు ఇళ్ల స్థలాల పట్టాలను అందజేస్తారని ఎంపీ చెప్పారు. ఏపీలో మదనపల్లిలో వాన నీటిని నిల్వ చేయడానికి నిర్మించిన డ్యాం నుంచి వానాకాలంలో వృథాగా వెళుతున్న నీటిని కోలారు జిల్లాలోని చెరువులకు అందించడం గురించి అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు.