
గ్రామపెద్దల దాష్టీకం
మండ్య(కర్ణాటక): చిన్న కారణానికి భార్యాభర్తలు గొడవ పడటంతో గ్రామ పెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. ఆ దంపతులకు గుండు గీయించిన ఘటన జిల్లాలోని మళవళ్లి తాలూకా ద్యావపట్టణ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గతనెల 17న ఉదయం 6 గంటల సమయంలో మహిళ, ఆమె పిల్లలు తన భర్తతో తాగుడు విషయంపై గొడవ పడ్డారు.
భార్య గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసింది. నీతో పాటు నీ భర్తకు తలా రూ.5 వేల జరిమానా, ఇద్దరు గుండు గీయించుకోవాలని రచ్చబండ వద్ద తీర్పు చెప్పారు. అంతేకాకుండా దగ్గరుండి ఇద్దరికీ శిరోముండనం చేయించారు. దీంతో బాధితురాలు లబోదిబోమంది. గ్రామంలో తిరగలేకపోతున్నానని, న్యాయం కోరితే ఇలా అవమానం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెళకవాడి ఎస్‌ఐ ప్రకాష్ ఆ గ్రామంలో విచారించి నాగణ్ణ, మహాదేవ, కుమార్, సోమణ్ణ, మల్లయ్యలతో సహా ఐదుగురిపై కేసు నమో