
ఘనంగా గ్రంథ పాలకుల దినోత్సవం
హుబ్లీ: రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథ పాలకుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. గ్రంథాలయాల పితామహుడిగా వాసికెక్కిన ఎస్‌ఎన్ రంగనాథ్ 133వ జయంతిని పురస్కరించుకొని బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో ప్రధాన కార్యక్రమం నిర్వహించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా, నగర, శాఖా గ్రంథాలయాల్లో ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా నవనగర శివానంద మఠంలోని శాఖ గ్రంథాలయంలో అక్కడి సీనియర్ ఉద్యోగి హిరేమఠ, పలువురు పాఠకులతో కలిసి రంగనాథ్ జయంతి వేడుకలను ఆయన చిత్రపటానికి పూజలు చేసి ఘనంగా జరిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు బెంగళూరు రవీంద్ర కళా క్షేత్రంలో జరిగిన గ్రంథ పాలకుల దినోత్సవంలో పాల్గొన్నారు.