
కర్ణాటక ఎమ్మెల్సీ భోజేగౌడ వెల్లడి
బెంగళూరు: వీధి కుక్కల అంశంపై కర్ణాటక శాసన మండలిలో బుధవారం వాడీవేడిగా చర్చ జరిగింది. జేడీ(ఎస్) ఎమ్మెల్యే ఎస్.ఎస్.భోజేగౌడ్ చేసిన వ్యాఖ్యలపై జంతు ప్రేమికులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను చిక్కమగళూరు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో 2,800 శునకాలను చంపేయడాన్ని స్వయంగా పర్యవేక్షించానని ఆయన చెప్పారు. చంపిన శునకాలను చెట్ల కింద సమాధి చేశామని తెలిపారు. చెట్లకు సహజ ఎరువుగా మారడానికే ఇలా చేశామని వెల్లడించారు. అది సాధారణ విషయం అన్నట్లుగా ఆయన నవ్వుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వీధి కుక్కలను చంపేసి, ఎరువుగా మార్చామన్న భోజేగౌడ ఒక క్రూరుడు అని సోషల్ మీడియాలో జనం మండిపడుతున్నారు.