
ఘజియాబాద్: వీధి కుక్కలు స్వైర విహారంతో ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతున్న అంశాన్ని సుప్రీంకోర్టు సైతం తీవ్ర పరిగణించిన సంగతి తెలిసిందే. వీధుల్లో ప్రమాదకరంగా సంచరించే కుక్కలను తగు షెల్టర్లు ఏర్పాటు చేసి వాటిని అక్కడకు తరలించాలని ఇటీవల ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం.
ఇదిలా ఉంచితే, యూపీలో ఒక ఉదంతం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఒక మహిళ.. కుక్కకు ఆహారం పెడుతూ చెంప దెబ్బల బారిన పడింది. తన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉన్న వీధి కుక్కకు ఓ మహిళ ఆహారం పెడుతుంటే దాన్ని ఆ అపార్ట్‌మెంట్ వాసి ఒకరు అడ్డుకున్నారు. ఇక్కడ ఎందుకు కుక్కకు ఆహారం పెడుతున్నావా? అని అడగ్గా, ఇందులో తప్పేముంది అంటూ ప్రశ్నించింది.
దాంతో ఆ మహిళను చెంప దెబ్బ కొట్టాడు సదరు వ్యక్తి. ఇలా ఆమె ఆహారం పెడుతూనే ఉంది.. అతను చెంప దెబ్బలు కొడుతూనే ఉన్నాడు. సుమారు 38 సెకన్లలో 8సార్లు చెంప దెబ్బలకు గురైంది సదరు మహిళ. ఘజియాబాద్‌లోని విజయ్ నగర్‌లోని బ్రహ్మపుత్రా ఎన్‌క్లేవ్ సోసైటీలో ఇది జరిగింది. ఆ మహిళను చెంప దెబ్బలు కొట్టిన వ్యక్తిని కమల్ ఖన్నాగా గుర్తించారు.
ఇదీ చదవండి: