అడ్డుగా ఉన్నాడని కడతేర్చారు | - | Sakshi
Sakshi News home page

అడ్డుగా ఉన్నాడని కడతేర్చారు

Aug 13 2025 5:18 AM | Updated on Aug 13 2025 5:18 AM

అడ్డు

అడ్డుగా ఉన్నాడని కడతేర్చారు

దొడ్డబళ్లాపురం: అక్రమ సంబంధం బయట పడటంతో ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన ఓ వ్యక్తి తన ప్రియురాలి భర్తను కడతేర్చాడు. ఈ ఘటన బెంగళూరు ఉత్తర తాలూకా మాచోహళ్లిలో చోటుచేసుకుంది. మాచోహళ్లిలో విజయ్‌కుమార్‌(35), ఆశ దంపతులు నివాసం ఉంటున్నారు. విజయ్‌కుమార్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఆశ ఆటోడ్రైవర్‌ ధనంజయ్‌(35)తో సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయం తెలిసి విజయ్‌కుమార్‌ గొడవ పడగా పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. సర్దిచెప్పి రాజీ చేసి పంపించారు. అయినప్పటికీ ఆశ ధనంజయ్‌తో సంబంధం కొనసాగించింది. మరో వైపు ధనంజయ్‌ని చంపేస్తానని విజయ్‌కుమార్‌ చెప్పుకుని తిరుగుతుండేవాడు. దీంతో విజయ్‌కుమార్‌ని హత్య చేయాలని ధనంజయ స్కెచ్‌ వేశాడు. పథకం ప్రకారం సోమవారం రాత్రి విజయ్‌కుమార్‌ ఇంట్లోంచి బయటకు రాగానే తన గ్యాంగ్‌తో కలిసి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు మాదనాయకనహళ్లి పోలీసులు నిర్ధారించారు. ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి భార్య ఆశను అదుపులోకి తీసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

రియల్‌ ఎస్టేట్‌

వ్యాపారి హత్య

అడ్డుగా ఉన్నాడని కడతేర్చారు1
1/2

అడ్డుగా ఉన్నాడని కడతేర్చారు

అడ్డుగా ఉన్నాడని కడతేర్చారు2
2/2

అడ్డుగా ఉన్నాడని కడతేర్చారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement