
కోర్టుకు హాజరైన దర్శన్
యశవంతపుర: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ఏ–2గా ఉన్న నటుడు దర్శన్, ఏ–1గా ఉన్న నటి పవిత్రాగౌడ మంగళవారం బెంగళూరు నగరంలోని సీసీహెచ్ 63వ కోర్టులో హాజరయ్యారు. విచారించిన కోర్టు కేసును సెప్టెంబర్ 9కి వాయిదా వేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న పుట్టస్వామి, రాఘవేంద్ర, నందీశ్, రవిశంకర్, నాగరాజు, లక్ష్మణ్, దీపక్‌కుమార్‌లు కోర్టులో హాజరయ్యారు. వినయ్, కార్తీక్, కేశవమూర్తి, నిఖిల్‌లు గైర్హాజరయ్యారు. వచ్చే వాయిదాకు తప్పని సరిగా అందరూ హాజరు కావాలని న్యాయమూర్తి సూచనలు చేశారు. విచారణ ముగిసిన తర్వాత పవిత్రాగౌడ కోర్టు ఆవరణలోనే వేచి ఉండగా దర్శన్ ఆమె వైపు చూడకుండానే వెళ్లిపోయాడు. దర్శన్ జతలో నటుడు ధన్వీర్ ఉన్నారు.