అర్ధరాత్రి 1 గంట వరకే కొత్త వేడుకలు | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి 1 గంట వరకే కొత్త వేడుకలు

Dec 23 2024 12:27 AM | Updated on Dec 23 2024 11:28 AM

-

శివాజీనగర: ఇక వారం రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది, పాత ఏడాదికి వీడ్కోలు పలికి నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు నగరవాసులు వేడుకలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సంబరాల నిర్వహణకు బీబీఎంపీ, పోలీస్‌ శాఖ కొత్త నిబంధనలను రూపొందించాయి.

సీసీ కెమెరాలు రెట్టింపు

సామూహిక వేడుకలకు కేంద్ర బిందువైన బెంగళూరులోని ఎం.జీ.రోడ్డు, బ్రిగేడ్‌ రోడ్డులలో సీసీ టీవీ కెమెరాలను పెంచుతారు. గత ఏడాది 300 సీసీ టీవీ కెమెరాలు ఉంటే, ఇప్పుడు 800 కు పెంచుతారు.

సంబరాలను అర్ధరాత్రి 1 గంటలోగా ముగించాలి. రాత్రి 10 గంటల తరువాత ఎంజీ రోడ్డు, బ్రిగేడ్‌ రోడ్డులో వాహన సంచారం బంద్‌ చేస్తారు. బార్‌, పబ్‌లకు కూడా రాత్రి 1 గంటకు మూసివేయాలి.

ఎంజీ రోడ్డు, బ్రిగేడ్‌ రోడ్డు మినహాయించి మిగతా చోట్లలో సంబరాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి. లౌడ్‌ స్పీకర్‌ డీజే వాడకం, టపాసులు పేల్చడానికి అనుమతి ఉండాలి. నిబంధనల ప్రకారం బారికేడ్లు, లైటింగ్‌ను అమర్చాలి.

వేడుకల్లో జనాలకు అనారోగ్యం తలెత్తితే పోలీసులే వైద్యులతో చికిత్స చేయిస్తారు.

పోలీసులు సూచించిన చోట వాహనాలను పార్క్‌ చేయాలి. మహిళల భద్రత కోసం ఎక్కువ సంఖ్యలో మహిళా పోలీసుల ఏర్పాటు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement