ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యం.. | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యం..

Feb 5 2024 1:26 AM | Updated on Feb 5 2024 8:08 AM

మహేష్‌ కుటుంబం  - Sakshi

మహేష్‌ కుటుంబం

మహేష్‌ తన స్నేహితుల మొబైల్‌కు వాయ్స్‌ మెసేజ్‌ చేసి ఏ బావిలోనో, చెరువులోనో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పారు.

మైసూరు: ఆర్థికంగా మోసం చేశారంటూ కుటుంబం మొత్తం కనిపించకుండా పోయిన సంఘటన ఎట్టకేలకు సుఖాంతమైంది. అదృశ్యమైన కుటుంబం క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో బంధుమిత్రులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు.. మైసూరులోని కేజీ కొప్పలులోఉన్న మహేష్‌ (35), అతని భార్య భవాని (28), కుమార్తె ప్రేక్ష (3), తండ్రి మహదేవప్ప (65), తల్లి సుమిత్ర (53) జనవరి 20వ తేదీ నుంచి కనిపించకుండాపోయారు. మహేష్‌ తన స్నేహితుల మొబైల్‌కు వాయ్స్‌ మెసేజ్‌ చేసి ఏ బావిలోనో, చెరువులోనో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పారు. భవాని సొదరుడు జగదీష్‌ సరస్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.

బెంగళూరులో మకాం
అప్పటినుంచి బెంగళూరులోని స్నేహితుని ఇంటిలో తలదాచుకున్న మహేష్‌ కుటుంబం మైసూరుకు తిరిగి రావడంతో బంధువులు సంతోషపడ్డారు. మార్కెటింగ్‌ వ్యాపారం చేసే మహేష్‌ పూచీకత్తు ఇవ్వగా వీరేష్‌ అనే వ్యక్తి రూ. 35 లక్షల వరకూ అప్పులు చేశాడు. వీరేష్‌ పరారు కావడంతో రుణదాతలు మహేష్‌ చెల్లించాలని వెంటపడ్డారు. దీంతో వేధింపులను తట్టుకోలేక మహేష్‌ కుటుంబంతో సహా పరారు అయ్యాడు. కాగా, వారసత్వ నగరిలో ఇటీవలికాలంలో ఆర్థిక నేరాలు పెరిగాయి. అప్పులు తీసుకుని చెల్లించలేదనే బాధతో మూడు రోజుల కిందట భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. అలాగే సైబర్‌ వంచకుల మోసాలు కూడా అధికమయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement