
రాయకోట సమీపంలో రోడ్డు దాటుతున్న ఏనుగుల మంద
హోసూరు వార్తలు..
క్రిష్ణగిరి: హోసూరు – క్రిష్ణగిరి జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనింది. కారులోని ఆరు మందికి తీవ్ర గాయాలు తగిలాయి. ఈ ఘటన సూళగిరి వద్ద జరిగింది. వివరాలు.. పుదుచ్చేరికి చెందిన గణపతిలాల్ (40). మంగళవారం కుటుంబంతో కలిసి బెంగళూరుకు వెళుతున్నాడు. సూళగిరి సమీపంలోని ఒడ్డేనూరు వద్ద ముందు వెళుతున్న లారీని వీరి కారు ఢీకొట్టింది. కారు ముందు భాగం నుజ్జు కాగా, అందులోని గణపతిలాల్, అతని భార్య దేవి (35), కూతుళ్లు శశికుమారి (12), హేమలత (9), సాక్షి (6), నాలుగు నెలల పాపతో పాటు ఆరు మంది తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి చికిత్స కోసం హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రెండు లారీలు ఢీ, క్లీనర్ మృతి
కావేరి పట్టణం సమీపంలో లారీని కంటైనర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో క్లీనర్ మృతి చెందగా డ్రైవర్‌కు గాయాలు తగిలాయి. సేలం జిల్లా కడయంబట్టి ప్రాంతానికి చెందిన భూపతి (23). క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తేని జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ తంగవేల్ (53)తో కలిసి కావేరిపట్టణం సమీపంలో వెళ్తుండగా వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ఢీకొనడంతో భూపతి అక్కడికక్కడే మరణించాడు.
కుటుంబానికి తీవ్ర గాయాలు