అదనపు కట్నం కోసమే హత్య | - | Sakshi
Sakshi News home page

అదనపు కట్నం కోసమే హత్య

Sep 23 2023 1:54 AM | Updated on Sep 23 2023 8:27 AM

- - Sakshi

మంగళవారం రాత్రి రెండు కాళ్లు, చేతులు, కడుపు వద్ద గాయాలు చేశారని, ఎడమ వేలిని విరిచేశారన్నారు. భర్త మేడ పైనుంచి ఆమెను కిందకు తోసి హత్య

కర్ణాటక: అదనపు కట్నం కోసం తన కుమార్తె శిల్పాను హత్య చేశారని మృతురాలి తండ్రి ఇల్లూరు గోపాలయ్య పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. తన కుమార్తెను హత్య చేసి మిద్దె పైనుంచి పడి మరణించినట్లు ఆమె భర్త శరత్‌ కుటుంబ సభ్యులు అబద్ధం చెబుతున్నారన్నారు. నగరంలోని జవహర్‌ నగర్‌కు చెందిన శరత్‌తో శిల్పకు గత ఏడాది జూన్‌ 10న కర్నూలు జిల్లా ఆదోనిలోని చిక్కోరి ఫంక్షన్‌ హాల్‌లో ఘనంగా వివాహం జరిపామన్నారు. పెళ్లి సమయంలో రూ.25 లక్షల కట్నం, 25 తులాల బంగారం ఇచ్చామన్నారు.

రెండు నెలల పాటు భార్యభర్తల మధ్య సంసారం చక్కగా సాగిందన్నారు. అనంతరం శిల్పకు మానసికంగా వేధింపులు ప్రారంభమయ్యాయన్నారు. రెండు మార్లు పెద్దల సమక్షంలో రాజీ చేసి సంసారాన్ని చక్కదిద్దామన్నారు. గతేడాది దీపావళికి రెండు తులాల బంగారు ఇచ్చి పంపామన్నారు. వారం రోజుల క్రితం తనను అత్త శశికళ, మామ సురేష్‌, ఆడబిడ్డ సుశ్మిత, భర్త ప్రవీణ్‌ కుమార్‌ మరింత కట్నం తేవాలని వేధిస్తున్నారని, తాను ఆదోనికి వస్తానని తనను పిలుచుకెళ్లాలని గత సోమవారం శిల్ప తనతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.

అయితే మంగళవారం రాత్రి రెండు కాళ్లు, చేతులు, కడుపు వద్ద గాయాలు చేశారని, ఎడమ వేలిని విరిచేశారన్నారు. భర్త మేడ పైనుంచి ఆమెను కిందకు తోసి హత్య చేసి పరారయ్యాడని తెలిపారు. తన కుమార్తెను హత్య చేసి మేడ పైనుంచి కింద పడి మరణించిందని కుటుంబ సభ్యులు అబద్ధమాడారని ఆరోపించారు. కాగా జిల్లా ఎస్పీ నిఖిల్‌ శుక్రవారం శరత్‌ నివాసాన్ని శిల్ప తల్లిదండ్రుల సమక్షంలో పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement