స్మార్ట్‌ వాచీ కోసం స్నేహితుడి హత్య | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ వాచీ కోసం స్నేహితుడి హత్య

Sep 7 2023 1:10 AM | Updated on Sep 7 2023 6:49 AM

హతుడు అస్లాం (ఫైల్‌)  - Sakshi

హతుడు అస్లాం (ఫైల్‌)

కర్ణాటక: నగరంలోని బెంగేరి వెంకటేష్‌ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి స్మార్ట్‌ వాచీ విషయమై స్నేహితులిద్దరి మధ్య ప్రారంభమైన ఘర్షణ హత్యతో అంతమైంది. హతుడు సిద్రామనగర నివాసి అస్లాం మకాందార్‌ కాగా గాయత్రినగర మంజునాథ్‌ నిందితుడు. కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మృతుడు అస్లాం మకాందార్‌ నిందితుడు మంజునాథ్‌ ఇద్దరు మంచి స్నేహితులు. కొద్ది రోజుల క్రితం మంజునాథ్‌ అస్లాంకు స్మార్ట్‌ వాచీని ఇచ్చాడు.

అయితే అస్లాం సదరు వాచీని తిరిగి ఇవ్వకుండా వేధించాడు. ఈక్రమంలో మధ్య రాత్రి బెంగేరి వెంకటేష్‌ కాలనీలో ఎగ్‌రైస్‌ తింటుండగా ఇదే విషయమై ఇద్దరూ ఘర్షణ పడ్డారు. మంజునాథ్‌ చాకుతో అస్లాం ఛాతీపై పొడిచాడు. దీంతో తీవ్రంగా రక్తస్రావమైన అస్లాంను అతడి స్నేహితులు కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స ఫలించక అతడు మృతి చెందాడు. ఘటనపై కేశ్వాపుర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement