తండ్రి బదిలీ.. కూతురు బీవీ వర్షకి  బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

తండ్రి బదిలీ.. కూతురు బీవీ వర్షకి  బాధ్యతలు

Jun 22 2023 7:14 AM | Updated on Jun 22 2023 7:51 AM

- - Sakshi

ఒక ఎస్‌ఐ బదిలీ అవుతూ బాధ్యతలను తన కూతురికి అప్పగించారు.

కర్ణాటక: ఒక ఎస్‌ఐ బదిలీ అవుతూ బాధ్యతలను తన కూతురికి అప్పగించారు. ఆమె కూడా ఎస్‌ఐగా పనిచేస్తుండడం విశేషం. ఈ వినూత్న సంఘటన మండ్యలో జరిగింది. మండ్య సెంట్రల్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ బీఎస్‌ వెంకటేశ్‌ ఎస్పీ ఆఫీసుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలోకి కొత్త ఎస్‌ఐగా బీవీ వర్ష నియమితులయ్యారు. ఆమె ఎవరో కాదు.. వెంకటేశ్‌ కూతురే.

తొలి పోస్టింగ్‌ ఇక్కడే
ఎంఏ అర్థశాస్త్రం చదివిన వర్ష 2022 బ్యాచ్‌లో కలబురిగిలో శిక్షణ తీసుకుని ట్రైనీ ఎస్‌ఐగా ఇదే పీఎస్‌లో పనిచేశారు. తొలి పోస్టింగ్‌ కూడా మండ్యలోనే జరగడం గమనార్హం. అది కూడా తండ్రి పని చేసి బదిలీ అయిన మండ్య సెంట్రల్‌ పోలీసు స్టేషన్‌కే. బుధవారం తన తండ్రి వెంకటేశ్‌ నుంచే వర్ష చార్జ్‌ తీసుకుని పూర్తిస్థాయి ఎస్‌ఐగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తండ్రీ కూతురు స్టేషన్‌లోని సిబ్బందికి స్వీట్లు పంచి వేడుక చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement