బనశంకరి: బెంగళూరు మహిళలకు సురక్షితమైన నగరం, దేశంలోనే మొదటి స్థానం, ప్రపంచస్థాయిలో కూడా మంచి ర్యాంకు పొందిందని ఇటీవల నగర పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ ప్రకటించడం తెలిసిందే. దీంతో ఐటీ సిటీలో మహిళల భద్రతకు ఎలాంటి ఢోకా లేదని అందరూ అనుకున్నారు. అంతలోనే ఒళ్లు గగుర్పొడిచే భయానక సంఘటన వెలుగులోకి వచ్చింది. సినిమాలో మాదిరిగా ఓ దుండగుడు యువతిపై దాడికి పాల్పడ్డాడు.
గొంతు కోస్తానంటూ..
బెంగళూరు ఇందిరానగరలో వంద అడుగుల రోడ్డులో జరిగిన అరాచకం వీడియో మంగళవారం బయటకు రావడంతో చూసినవారందరూ నివ్వెరపోయారు. ప్రభురాజ్ అనే డెలివరీ బాయ్.. కత్తి తీసుకుని ఓ షాపులోకి చొరబడి అందులో పనిచేసే జయశ్రీ అనే యువతి చైన్ లాక్కున్నాడు. పారిపోతుండగా ఆమె అడ్డుకోవడంతో కత్తితో ఆమె గొంతు కోస్తానని బెదిరించి ఆటోలో పరారీకి విఫలయత్నం చేశాడు. ఈ హైడ్రామా నడుమ కొందరు జనం ఆమెను కాపాడి దుండగునికి దేహశుద్ధి చేశారు. చావు అంచుల వరకూ వెళ్లిన బాధితురాలు తీవ్ర భయాందోళనకు లోనైంది.
సినిమా స్టైల్‌లో స్నాచర్ అరాచకం
బెంగళూరులో దురాగతం


