దొడ్డబళ్లాపురం: ట్రాన్స్‌ఫార్మర్ పేలిన ప్రమాదంలో పలు వాహనాలు, దుకాణాలు దగ్ధమైన సంఘటన దావణగెరె నగరంలో జరిగింది. కేటీజే నగర్ 8వ క్రాస్‌లో రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయి అక్కడ నిలిపి ఉన్న టాటాఏస్ ఆటో, కొన్ని బైక్‌లు, అంగళ్లకు మంటలు వ్యాపించాయి. పేలుడు శబ్ధానికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. బాంబు పేలినట్టు నిప్పు రవ్వలు చుట్టుపక్కల చెల్లాచెదురుగా పడ్డాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. పొద్దున నుంచి ట్రాన్స్‌ఫార్మర్ నుంచి నిప్పు రవ్వలు వస్తుండడంతో బెస్కాం కార్యాలయానికి కాల్ చేసి చెప్పామని, అయితే వారు స్పందించలేదని, వారి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించాలని నష్టపోయినవారు డిమాండ్ చేశారు.


