బళ్లారిలో అనుమానిత ఉగ్రవాది అరెస్టు | - | Sakshi
Sakshi News home page

బళ్లారిలో అనుమానిత ఉగ్రవాది అరెస్టు

Jun 15 2023 8:08 AM | Updated on Jun 15 2023 8:06 AM

- - Sakshi

సాక్షి, బళ్లారి: నిషేధిత పీఎఫ్‌ఐకి సంబంధించిన కొంతమంది యువకులకు తుపాకులు, మారణాయుధాలు ఎలా ఉపయోగించాలి అనేదానిపై శిక్షణ ఇస్తున్న మహమ్మద్‌ యూసఫ్‌ అనే అనుమానిత ఉగ్రవాదిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు.

నగరంలోని కౌల్‌బజార్‌లో తలదాచుకున్న నిందితుడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని పీఎఫ్‌ఐ సభ్యులకు ఆయుధాల వాడకంపై శిక్షణ ఇచ్చారనే ఆరోపణలున్నాయి. పీఎఫ్‌ఐని నిషేధించిన తర్వాత కౌల్‌బజార్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి కోసం ప్లంబర్‌ పని చేసుకుంటూ, గుట్టుగా ఆయుధాల శిక్షణనిచ్చేవాడని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement