చిక్కమగళూరుకు టికెట్‌ అడిగితే మంగళూరుకు.. | - | Sakshi
Sakshi News home page

చిక్కమగళూరుకు టికెట్‌ అడిగితే మంగళూరుకు..

Jun 9 2023 8:04 AM | Updated on Jun 9 2023 8:03 AM

- - Sakshi

కర్ణాటక: చిక్కమగళూరుకు టికెట్‌ అడిగితే మంగళూరుకు టికెట్‌ ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రయాణకులకు ఇబ్బంది కలిగించిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు...కడూరు నుంచి చిక్కమగళూరుకు వెళ్తున్న బస్సులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 మంది తెలుగువారు ఎక్కారు. వీరు గురువారం చిక్కమగళూరు దత్తపీఠకు వెళ్లటానికి కడూరులో రైలు దిగి, అక్కడ నుంచి మంగళూరు బస్సు ఎక్కి చిక్కమగళూరుకు టికెట్‌ తీసుకున్నారు.

అయితే కండక్టర్‌ మంగళూరుకు టికెట్‌ ఇచ్చి దత్తపీఠం భక్తులకు మోసం చేశాడు. చిక్కమగళూరుకు రూ. 45 చార్జీ ఉండగా మంగళూరుకు రూ. 202 తీసుకున్నాడు. కేవలం 40 కి.మీ ఇంత చార్జీ అవుతుందా అని ప్రయాణికులు ప్రశ్నించారు. చిక్కమగళూరులో దిగుతుండగా 18 మంది నుంచి టికెట్‌ వాపస్‌ ఇవ్వాలని అడగటంపై ప్రయాణికులు కండక్టర్‌పై ఆక్రోశం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement