రాష్ట్రంలో 5.54 కోట్ల ఓటర్లు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో 5.54 కోట్ల ఓటర్లు

Aug 6 2026 2:26 AM | Updated on Aug 6 2026 2:26 AM

దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో చేపడుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సమీక్ష (సర్‌)లో 99.84 శాతం డిజిటలైజేషన్‌ పూర్తయింది. రాష్ట్రంలో 5,54,32,314 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది.

4.43 కోట్లు యాక్టివ్‌

● బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి అన్బుకుమార్‌ వివరాలను తెలిపారు. 5.54 కోట్ల ఎన్యూమరేషన్‌ ఫారంలు ముద్రించి బీఎల్‌ఓలకు పంపిణీ చేశామన్నారు.

● 4,43,04,632 మంది ఓటర్ల వివరాలు డిజిటల్లీ యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. 1,11,07,461 (20 శాతం) దాఖలాలను ఏఎస్‌డీడీఓ తనిఖీలోకి చేర్చామన్నారు.

● 66,64,943 మంది ఓటర్లు చిరునామాను శాశ్వతంగా మార్చారని తెలిపారు.

● 16,30,872 మంది చనిపోయిన ఓటర్లు ఉన్నారు.

● 16,30,753 మంది ఓటర్ల చిరునామా, వివరాలు అందుబాటులో లేవు.

బెంగళూరులో భారీ తేడా

సర్‌ ప్రక్రియలో బెంగళూరులో అత్యధికంగా ఓటర్లు గల్లంతయ్యారు. బెంగళూరు నగర జిల్లాలో 45 శాతం, బె.ఉత్తర జిల్లాలో 47 శాతం, బె.సెంట్రల్‌లో 48 శాతం, బె.దక్షిణలో 51 శాతం మంది ఓటర్ల వివరాలు లేవని సీఈఓ చెప్పడం విశేషం. మృతులు, అడ్రస్‌ మార్పులు, ఆచూకీ లేనివారు ఇందులో ఉండవచ్చన్నారు. బె.గ్రామీణ, జీబీఏ నార్త్‌, జీబీఏ సెంట్రల్‌, జీబీఏ దక్షిణలో 100 శాతం ఎన్యుమరేషన్‌ ఫారంలు పంపిణీ చేసినట్టు తెలిపారు.

సర్‌ 99 శాతం డిజిటలైజేషన్‌ పూర్తి

బెంగళూరు పరిధిలో ఎక్కువ ఓటర్ల గల్లంతు

సీఈఓ అన్బుకుమార్‌ వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement