బాగేపల్లిలో బంద్‌ | - | Sakshi
Sakshi News home page

బాగేపల్లిలో బంద్‌

Aug 6 2026 2:26 AM | Updated on Aug 6 2026 2:26 AM

ముమ్మరంగా అభిమానుల నిరసనలు

బాగేపల్లి: ఎమ్మెల్యే సుబ్బారెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు బుధవారం కూడా వినూత్నంగా నిరసన తెలిపారు. అలాగే పట్టణ బంద్‌ నిర్వహించగా విజయవంతమైనట్లు ప్రకటించారు. పట్టణంలో ఉదయం నుంచే ధర్నా ప్రారంభమైంది. కార్యకర్తలు పట్టణ నలు దిక్కుల నుంచి వాహనాల రాకపోకలను తాత్కాలికంగా అడ్డుకున్నారు. మిరపకాయలను తిని, టైర్లను కాల్చి, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. వాహనాల ముందు కూర్చున్నారు. సుబ్బారెడ్డికి పదవి ఇవ్వకుండా నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు. పట్టణంలోని షాపులు, సముదాయాలు మూతపడ్డాయి. పలుచోట్ల నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement