మైసూరు: త్వరలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం మైసూరు పాలికె ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛతా అభియాన్ జరిగింది. చిక్కవీరణ్ణ రోడ్డులో ప్లాస్టిక్ బాటిళ్లు, వ్యర్థాలు, చెత్తచెదారాన్ని చీపుర్లతో ఊడ్చి తొలగించారు. 5 లోడర్లు, 10 టిప్పర్లు, 5 డోజర్లతో చేపట్టిన ఈ అభియాన్‌లో మొత్తం 83 టన్నుల వ్యర్థాలను ఖాళీ చేయించారు. జిల్లాధికారి లక్ష్మీకాంత్‌రెడ్డి, పాలికె కమిషనర్ ఎంకే సవిత, అధికారులు, సిబ్బంది పాల్గొని స్వయంగా చీపుర్లు పట్టి చెత్తను ఊడ్చారు. తరువాత ప్రజలతో కలిసి స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు.
మైసూరులో స్వచ్ఛ సేవ


