● కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి.. మంత్రి శ్రీధర్‌బాబు
మంథని: అంతర్జాతీయ ిస్థాయిలో పేరుగాంచిన విశ్వవిద్యాలయాలు, కళాశాలను తెలంగాణకు తీసుకువచ్చే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లండన్, అమెరికా పర్యటనకు వెల్లేందుకు సిద్ధంగా కాగా భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించడం బాధాకరం, దురదుష్టకరమని రాష్ట్ర, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా మంథనిలో విలేకరులతో మాట్లాడారు. ఏటా వందలాది మంది విద్యార్థులు తెలంగాణ నుంచి విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తున్నారని, ఈ క్రమంలో అనేకమంది తల్లిదండ్రులకు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఆ స్థాయి విద్య ఇక్కడే అందరికీ అందుబాటులో ఉండేలా తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. లండన్‌లో పేరుగాంచిన విశ్వవిద్యాలయంలో భారత రాజ్యంగ నిర్మాత అంబేడ్కర్ విద్య అభ్యసించారన్నారు. అనేకమంది సీఎంలు వెళ్తున్నారని, గుజరాత్ సీఎం అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇచ్చి తెలంగాణ సీఎంకు ఎందుకు నిరాకరించారో.. ఆ కోణం ఏంటో అని మంద్రతి అసహనం వ్యక్తం చేశారు.
కరీంనగర్: రైస్ మిల్లర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం సంఘ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అన్నమనేని సుధాకర్‌రావు, ప్రధాన కార్యదర్శిగా బోనగిరి శశికిరణ్, కోశాధికారిగా గిరిధర్‌లాల్ డోడియా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ, మిల్లర్లకు సంబంధించిన సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి, సంఘం సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన మిల్లర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
కరీంనగర్‌అర్బన్: దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి ఉద్యోగ లోకం నడుం బిగుస్తోంది. ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో సోమవారం స్థానిక టీఎన్జీవో భవన్‌లో సన్నాహాక సమావేఽశం నిర్వహించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అధికారులు, టీఎన్జీవో అనుబంధ సంఘాలు పాల్గొనగా ఈ నెల 27న కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఉద్యోగులు, పెన్షనర్లు నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని, సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి మహాధర్నా, నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎంప్లాయీస్ జేఏసీ సెక్రటరీ జనరల్ మడిపల్లి కాళీచరణ్‌గౌడ్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు, రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మేందర్‌సింగ్, జైపాల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సప్తగిరికాలనీ(కరీంనగర్): జీవో 97ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థి సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎరవెల్లి జగన్ డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం సరికాదన్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్నిచ్చారు. విద్యార్థి నాయకులు అభిజ్ఞ, సోను అఖిల, కీర్తన, మేఘనరెడ్డి, మహేశ్వరి, ప్రణిత, రవళి, డీఎస్‌ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.


