ప్రజావాణికి అర్జీల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి అర్జీల వెల్లువ

Aug 25 2026 1:09 AM | Updated on Aug 25 2026 1:09 AM

● పెద్ద సంఖ్యలో దరఖాస్తులు ● జిల్లా కేంద్రానికి వచ్చి ఇచ్చేందుకే ఎక్కువ మంది ఆసక్తి ఏళ్లుగా తిరుగుతున్నా..

కరీంనగర్‌అర్బన్‌: తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ప్రజావాణి బాట పడుతున్నారు. గత సోమవారం మండలస్థాయిలో ప్రజావాణి ప్రారంభమైనప్పటికీ కలెక్టరేట్‌కే రావడం విశేషం. అందులోనూ కలెక్టర్‌ చిత్రామిశ్రాకే అర్జీ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. కలెక్టర్‌కు తమ సమస్య తె లిస్తే పరిష్కారం అవుతుందన్నది ప్రగాఢ విశ్వాసం. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అర్జీలే ఎక్కువగా వచ్చాయి. కలెక్టర్‌ చిత్రామిశ్రా అర్జీలు స్వీకరించి ఓపికగా బాధితుల సమస్యలు వింటున్నారు. అదనపు కలెక్టర్లు డి.శ్రీనివాస్‌రెడ్డి, అశ్విని తానాజీవాకడే, జిల్లా రెవెన్యూ అధికారి జె.స్వామి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 193 దరఖాస్తులు వచ్చాయని కలెక్టరేట్‌ ఏవో గడ్డం సుధాకర్‌ వివరించారు.

మా తాత పురంఽశెట్టి నర్సయ్య 2013లో మరణించారు. అతనికి మా అమ్మ, మరో కూతురు సంతానం. గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 8లో 24గుంటల భూమి ఉంది. సదరు భూ వివరాలు తాత పేరున ఉన్నాయి. మా అమ్మ భాగ్యలక్ష్మి పేరున మార్చాలని 13ఏళ్లుగా తిరుగుతున్నా. జీపీవో, ఆర్‌ఐ మోకాపై విచారణ చేశారు. అభ్యంతరం లేదని మా చిన్నమ్మ రాసిచ్చింది. అయినా రికార్డులో మా అమ్మ పేరు చేర్చడం లేదు. పాస్‌బుక్‌లో వివరాలు లేకుంటే ఎరువులు ఇస్తలేరు. రైతు భరోసా వస్తలేదు.

– కట్కం చందు, న్యాలకొండన్నపల్లి, గంగాధర

మొత్తం అర్జీలు: 193

కరీంనగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌: 58

హౌజింగ్‌ పీడీ: 42, ఎస్డీసీ ఎల్‌ఏ: 23

ఆర్డీవో, కరీంనగర్‌: 11

హుజూరాబాద్‌ మున్సిపాలిటీ: 11

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement