కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ సూర్యనగర్‌లోని అల్ఫోర్స్ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల మేనేజ్‌మెంట్ క్లబ్ ఆధ్వర్యంలో ‘ప్రబంధ–2కే26’ మేనేజ్‌మెంట్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం అల్ఫోర్స్ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల చైర్మన్ వి.రవీందర్ రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి శాతవాహన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్ ప్రిన్సిపాల్ డా.ఎన్.రంగప్రసాద్ చీఫ్‌గెస్ట్‌గా, ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ సి.మల్లారెడ్డి స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ పాటిస్తూ అకడమిక్స్‌తో పాటు ఇతర కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రతిభను పెంచుకోవాలన్నరారు. కళాశాల చైర్మన్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్య ఆధారిత కార్యక్రమాల్లో పాల్గొని వ్యక్తిగత, వృత్తిపరమైన సామర్థ్యాలు అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఇంక్యుబేషన్ సెల్ ద్వారా కొత్త ఆలోచనలను రూపొందించి భవిష్యత్తులో జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ గివర్స్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. మీట్‌తో భాగంగా ఫార్మల్, ఇన్‌ఫార్మల్ ఈవెంట్లు, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రిన్సిపాల్, అధ్యాపకులు, మేనేజ్‌మెంట్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.


