చిగురుమామిడి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. శనివారం సీపీఐ జాత చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, కొండాపూర్, నవాబుపేట్, సుందరగిరి గ్రామాల్లో పర్యటించింది. చాడ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు దేశాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ప్రజా సంక్షేమం, సుపరిపాలన అందిస్తామని వాగ్దానం చేసి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందె స్వామి, పోనుగంటి కేదారి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


