● ఇద్దరు నిందితుల రిమాండ్‌కు తరలింపు
● పట్టణ సీఐ కరుణాకర్ వెల్లడి
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు వద్ద ఈ–సిగరెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ పురుషోత్తంరెడ్డి సూచనతో సీసీఎస్ పోలీసులు, టౌన్ ఎస్సై సుప్రియతో కలిసి చింతకుంట చెరువు వద్దకు చేరుకోగా.. పట్టణంలోని పురాణిపేటకు చెందిన మహ్మద్‌అబ్దుల్ వహీద్ జమీల్, ఇస్లాంపురకు చెందిన మహ్మద్ ఫహద్ ఈ–సిగరెట్లు విక్రయిస్తూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని రూ.27,500 విలువైన 11 సిగరెట్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. సీఐ మాట్లాడుతూ ఈ–సిగరెట్లు కొన్నా.. విక్రయించినా.. నిల్వ చేసినా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో కానిస్టేబుళ్లు జీవన్, అనిల్ పాల్గొన్నారు.


