అన్న, అక్క ఏఈ శిక్షణ కార్యక్రమంతో విద్యార్థులకు బోధన అనుభవం కలుగుతుంది. సేవాభావం, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి. భవిష్యత్‌లో మంచి అవకాశాలను ఎంచుకునే విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. శిక్షణలో పాల్గొంటున్న విద్యార్థులకు రెండు క్రెడిట్స్ వస్తాయి. – ప్రొఫెసర్ విజయలక్ష్మి,
ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, గంభీరావుపేట
మెంటార్షిప్‌లో భాగంగా మాకు నాగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కేటాయించారు. లెర్న్ టుగెదర్.. లివ్ టుగెదర్.. లీడ్ టుమారో.. అనే కాన్సెప్ట్‌తో విద్యాశాఖ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇది మాకు భవిష్యత్‌లో ఎంతగానో ఉపయోగపడుతుంది. నోడల్ ఆఫీసర్లు మా సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ సలహాలు, సూచనలు చేస్తున్నారు.
– మహ్మద్ అంజద్, బీకాం ఫైనలియర్ విద్యార్థి


