ఇబ్రహీంపట్నం: తాగుడు మానేయాలని భార్య సూ చించినందుకు మనస్తాపంతో భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని యామపూర్‌లో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై నవీన్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాస బుచ్చన్న, లక్ష్మీ భార్యాభర్తలు బుచ్చన్న మద్యానికి బానిసయ్యాడు. లక్ష్మీ వద్దని వారిస్తోంది. దీంతో మనస్తాపం చెందిన బుచ్చన్న (65) బాత్‌రూంలో ఉరేసుకున్నాడు. బుచ్చన్న కుమారుడు రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
జగిత్యాలక్రైం: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి గుండెపోటుతో చనిపోయిన జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన బత్తిని జలపతి (30) మృతదేహం గురువారం స్వగ్రామానికి చేరింది. జలపతి ఐదేళ్ల క్రితం జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. జూన్ 29న అక్కడే గుండెపోటుతో మృతిచెందాడు. గురువారం మృతదేహం అనంతారం చేరుకోగా కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. జలపతికి భార్య లావణ్య, కూతురు ఉన్నారు.
● మరొకరికి తీవ్ర గాయాలు
వేములవాడఅర్బన్: మున్సిపల్ పరిధి నాంపల్లి శివారులోని కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన వంగ శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు. గాయపడ్డ వేములవాడ మండలం చీర్లవంచకు చెందిన గాజుల సాయిలక్ష్మన్‌ను సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరూ కలిసి కరీంనగర్ నుంచి బైక్‌పై సిరిసిల్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు.


