తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో అరుదైన ఆదిమానవుల నివాస స్థావరం వెలుగుచూసింది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల సమీపంలోని సరిగుండ్లగుట్టల్లో సుమారు 10వేల సంవత్సరాల క్రితం నాటి(రాతియుగం) అరుదైన రాతి చిత్రాలను ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ సభ్యులు గురువారం తమ పరిశోధనలో కనుగొన్నారు. చిత్రాలతోపాటు ఆదిమానవులు రాతి పనిముట్లను పదును పెట్టుకోవడానికి ఉపయోగించిన రాతి తావులు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. జిల్లాలోని మూలవాగు, మానేరువాగు పరివాహక ప్రాంతాలైన రామప్పగుట్టలు, నాంపల్లి, సితారిగట్టు, బుర్కగుట్ట, మైసమ్మగుండు వంటి ప్రదేశాల్లో ఇప్పటికే ఇలాంటి చారిత్రక చిత్రాలు లభించాయి. తాజాగా సరిగుండ్లగుట్టల్లో వెలుగుచూశాయి. ఈ చారిత్రక ఆధారాలను ప్రభుత్వం వెంటనే సంరక్షించి, భవిష్యత్ తరాలకు అందించాలని చారిత్ర పరిశోధకులు రమేశ్ బృందం కోరుతున్నారు.
27 నుంచి ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్ పరీక్షలు
కరీంనగర్‌సిటీ: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఎల్‌ఎల్‌బీ ద్వితీయ సంవత్సరం సెమిస్టర్ పరీక్షల తేదీలను అధికారులు గురువారం ప్రకటించారు. రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 27న ప్రారంభమై ఆగస్టు 5న ముగియనున్నాయి. నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 28న ప్రారంభమై ఆగస్టు 6న ముగియనున్నాయి. వివరాలకు సంబంధిత కళాశాల, విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.సురేశ్ కుమార్ సూచించారు.


