ఆరాధనోత్సవం.. జానకమ్మ స్వరాభిషేకం | - | Sakshi
Sakshi News home page

ఆరాధనోత్సవం.. జానకమ్మ స్వరాభిషేకం

Jul 14 2026 12:12 AM | Updated on Jul 14 2026 12:12 AM

ఎస్‌. జానకితో అప్పటి

ధర్మకర్తల మండలి సభ్యులు

నందిపేట సుదర్శన్‌ యాదవ్‌

ప్రముఖ గాయని ఎస్‌. జానకితో వేములవాడ గాయని కే. రాధిక

2003లో వేములవాడకు వచ్చిన సందర్భంగా ఉమేశ్‌శర్మ నివాసంలో భోజనం చేస్తున్న గాయని జానకి

వేములవాడ: జానకమ్మ పాడితే అమృతవర్షం కురిసినట్లు ఉంటుంది. జానకమ్మ గొంతు మాయస్వరపేటిక. మనిషి ఒక్కరే.. విభిన్న స్వరాలుగా పాడడం ఆమె ప్రత్యేకత. ఇది వేములవాడ ప్రజలు 2003లో ప్రత్యక్షంగా విని.. మంత్రుముగ్ధులయ్యారు. రాజన్న సన్నిధిలో 2003లో నిర్వహించిన త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో గానకోకిల జానకమ్మ గళం నుంచి జాలువారిన అమృత వర్షం శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. జానకమ్మ పాడిన శ్రీరావమ్మ దుర్గమ్మ్ఙ కీర్తన ఓ అద్భుతం. నలుగురు వేర్వేరు వ్యక్తులు పాడుతున్నట్లుగా నాలుగు భిన్నమైన స్వరాలతో ఆలపించి అబ్బురపరిచారు. అప్పటి క్షణాలను ఈ ప్రాంత సంగీత ప్రియులు, గాయకులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు. జానకమ్మ గళం నుంచి జాలువారిన అమ్మవారి పాట త్యాగరాజ ఉత్సవాల్లో అద్భుత ఘట్టంగా నిలిచిందని కళాకారులు అభిప్రాయపడుతున్నారు.

మనిషి ఒక్కరు.. గొంతులు నాలుగు

త్యాగరాజ ఆరాధనోత్సవంలో ప్రత్యేక ఆకర్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement