కథలాపూర్: మండలంలోని చింతకుంటలో నాగం గంగరాజంకు చెందిన ట్రాక్టర్‌ను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. బాధితుడి కథనం ప్రకారం.. పొలం దున్ని ట్రాక్టర్‌ను గ్రామశివారులో ఉంచాడు. సోమవారం ఉదయం వెళ్లి చూడగా పూర్తిగా కాలిపోయి ఉంది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): నిరుపేద కుటుంబంలో పుట్టి వైద్యవిద్య ఎంఎస్(జనరల్ సర్జరీ) పూర్తి చేసిన కర్నె బాలయ్య కుమార్తె శ్రావ్యను బస్వాపూర్ పాలకవర్గం సోమవారం సన్మానించింది. సర్పంచ్ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రావ్య పట్టుదల, ఆత్మవిశ్వాసంతో వైద్యవిద్యను పూర్తి చేయడం గ్రామానికి గర్వకారణమన్నారు. ఉపసర్పంచ్ అనిల్, వార్డు మెంబర్లు మోతె మహేశ్, సజ్జనం ప్రశాంత్, శ్రీకాంత్, దేవరాజు పాల్గొన్నారు.


