యాజమాన్య పద్ధతులతో పంటలకు రక్షణ | - | Sakshi
Sakshi News home page

యాజమాన్య పద్ధతులతో పంటలకు రక్షణ

Jul 14 2026 12:12 AM | Updated on Jul 14 2026 12:12 AM

కరీంనగర్‌ అర్బన్‌: వానాకాలం సాగులో ఇప్పటివరకు తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో యాజమాన్య పద్ధతులతో పంటలు కాపాడుకోవచ్చని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఅర్డినేటర్‌ మధుకర్‌ వివరించారు. సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైందని, వర్షాలు అసమానంగా కురవడంతో రైతులు పంటల యాజమాన్యంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని వివరించారు. ఇప్పటికే విత్తిన పంటలకు నేలలో తేమను నిల్వ ఉంచేందుకు కలుపు మొక్కలను తొలగించి తేమ నష్టాన్ని తగ్గించాలని, వరుసల మధ్య పంట అవశేషాలు లేదా గడ్డి వేసి మల్చింగ్‌ చేయాలని సూచించారు. వర్షాలు పడే వరకు యూరియా వేయరాదని, మొక్కల్లో తేమ ఒత్తిడి తగ్గించేందుకు 1శాతం పొటాషియం క్లోరైడ్‌ లేదా 19:19:19 నీటిలో కరిగే ఎరువు లీటరుకు 10 గ్రాములు ఆకులపై పిచికారీ చేయాలన్నారు. మొక్కజొన్నలో మొలకలు సరిగా రాకపోతే 7–10 రోజుల్లో గ్యాప్‌ ఫిల్లింగ్‌ చేయాలని, వర్షం వచ్చే వరకు నత్రజని ఎరువులు వేయకుండా వేచి ఉండాలన్నారు. మంచి వర్షం వచ్చిన తర్వాత మాత్రమే నాట్లు వేయాలన్నారు. ఇంకా విత్తనం వేయని భూముల్లో 50–75 మి.మీ. సమృద్ధిగా వర్షం పడిన తర్వాత మా త్రమే స్వల్పకాలిక రకాల విత్తనాలు వేయాలన్నారు. మేత పంటలుగా జొన్న లేదా సజ్జ సాగు చేయవచ్చని తెలిపారు. అలాగే వర్షాలు పడే వరకు అధిక మో తాదులో రసాయన ఎరువులు వేయకుండా వాతావరణ సూచనలను అనుసరించి వ్యవసాయ పనులు చేపట్టాలని కోరారు.

బస్సు సీట్ల కోసం కొట్లాట

వేములవాడఅర్బన్‌: వేములవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులు సీట్ల కోసం కొట్లాడుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన శ్రావణ్‌–రజిత దంపతులు సికింద్రాబాద్‌లో ఉంటున్నారు. కుటుంబంతో కలిసి వేములవాడకు వచ్చారు. సికింద్రాబాద్‌కు చెందిన మరో కుటుంబం కూడా వేములవాడకు వచ్చి సోమవారం తిరుగు ప్రయాణంలో తిప్పాపూర్‌ ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు. సికింద్రాబాద్‌ బస్సు రాగానే సీట్ల కోసం శ్రవణ్‌–రజిత దంపతులకు మరో కుటుంబానికి మధ్య వాగ్వాద జరిగింది. ఈక్రమంలో ఎదుటి కుటుంబం వారు శ్రావణ్‌, రజితలపై పిడుగుద్దులతో దాడి చేశారు. శ్రావణ్‌కు ముక్కు నుంచి రక్తం కారగా.. ఇరు కుటుంబాల వారు పోలీస్‌స్టేషన్‌ చేరుకొని పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువురికి పోలీసులు కౌన్సెలింగ్‌ చేసి, పంపించి వేశారు.

భీమన్నకు నీరా‘జనం’

వేములవాడ: భీమన్నకు సోమవారం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆరుద్ర నక్షోత్రవం పురస్కరించుకుని శివుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ స్వామి వారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ ఈవో రమాదేవి, డీఈవో నవీన్‌ పరిశీలించారు.

రైతులకు ప్రధాన శాస్త్రవేత్త మధుకర్‌ సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement