కళాకారుడికి కష్టకాలం | - | Sakshi
Sakshi News home page

కళాకారుడికి కష్టకాలం

Jul 12 2026 3:17 AM | Updated on Jul 12 2026 3:17 AM

అనారోగ్యంతో ఆసుపత్రిలో..

వేములవాడరూరల్‌: ఎవరైనా అత్యవసరంగా రక్తం కోసం ఎదురు చూస్తున్నారంటే రెప్పపాటున వారి వద్ద వాలి రక్తదానం చేస్తాడు. కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్నానంటే తనకు తోచిన సహాయం అందిస్తాడు. సినిమా హీరో చిరంజీవి అభిమానిగా.. వేములవాడలో ప్రముఖ కళాకారుడిగా పేరున్న మారం ప్రవీణ్‌కుమార్‌(పప్పి) ప్రస్తుతం అనారోగ్యం బారిన పడి ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర ఎంతో ఉందని చెబుతున్న పాలకులు.. కళాకారులకు కష్టాలు వస్తే మాత్రం కనికరించడం లేదు. ఉద్యమకారులు, కళాకారులపై ప్రత్యేకంగా ఇటీవల ప్రభుత్వం కమిటీ వేసింది. కానీ ఇప్పటికే ఎంతోమంది ఉద్యమకారులు, కళాకారులు వివిధ కారణాలతో ఆర్థిక పరిస్థితి బాగా లేక అకాల మరణాలు చెందారు. వేములవాడ పట్టణానికి చెందిన ప్రవీణ్‌ కూడా ఒక కళాకారుడిగా వేములవాడ రాజన్న సన్నిధిలో జరిగే శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శంకరుడి వేషధారణతో 3 రోజులపాటు ఆలయ ప్రాంతంలో తిరుగుతూ భక్తులను అలరించాడు. లివర్‌ సమస్యతో నెల రోజులుగా ఆసుపత్రుల వెంట తిరుగుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. 1997 నుంచి డాన్స్‌ మాస్టర్‌, డైరెక్టర్‌, యాక్టర్‌గా చేశాడు. వందలాది పాటలకు హీరోగా చేశాడు. ఎంతోమంది కళాకారులను తయారు చేశాడు. ఇండస్ట్రీ ఆఫ్‌ తెలంగాణ ఫోక్‌(ఐటీఎఫ్‌) సంస్థను స్థాపించి ఫౌండర్‌గా ఉన్నాడు. లఘు చిత్రాలు తీస్తూ సామాజిక సేవకుడిగా ఆపదలో ఉన్నవారికి 25సార్లకు పైగా రక్తదానం చేశాడు. లివర్‌ రీప్లాంటేషన్‌ చేయాల్సి ఉండగా.. సర్జరీకి రూ.25లక్షల నుంచి రూ.30లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. మెడిసిన్‌, ఆసుపత్రి ఖర్చులకు మరో రూ.15లక్షలు ఖర్చవుతుందన్నారు. విషయం తెలుసుకున్న మై వేములవాడ చారిటబుల్‌ ట్రస్టు సభ్యులు ఇటీవల రూ.27వేలు అందజేశారు. ఎవరైనా దాతలు ఆర్థిక సాయం చేయాలనుకుంటే ఫోన్‌ నంబర్‌ 8125358565కు పంపాలని ఆయన వేడుకుంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement