ఏకో బ్యాగు | - | Sakshi
Sakshi News home page

ఏకో బ్యాగు

Jul 12 2026 3:17 AM | Updated on Jul 12 2026 3:17 AM

సింగిల్‌యూజ్డ్‌ కవర్లతో ప్రమాదం అవగాహన పెంచుకుంటున్న ప్రజలు

పలు ప్రాంతాల్లో నాన్‌ ఓవెన్‌, జ్యూట్‌ బ్యాగ్‌ల విక్రయాలు

ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి

ఉపాధి మార్గంతో పాటు పర్యావరణ హితం

సిరిసిల్లటౌన్‌/బోయినపల్లి(చొప్పదండి)/కోనరావుపేట/జమ్మికుంట/కాల్వ శ్రీరాంపూర్‌/వేములవాడ: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ చిరు వ్యాపారులు నాన్‌ ఓవెన్‌, బ్యాగులను తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను శాశ్వతంగా దూరం చేస్తూ చిరు వ్యాపారులు పేపర్‌ బ్యాగులు, జూట్‌బ్యాగులు, నాన్‌ వోవెన్‌ బ్యాగుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆర్థిక స్వావలంబన పొందుతున్నారు. ప్లాస్టిక్‌ కవర్లతో కలిగే నష్టాలను గ్రామాల్లో వివరిస్తూ పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు జూట్‌, పేపరు బ్యాగులు పంపిణీ చేస్తున్నారు. ప్లాస్టిక్‌ రహిత పల్లెలుగా కొన్ని గ్రామాలు అడుగులు వేస్తుండగా.. వాడినవారికి జరిమానా విధిస్తున్నారు. వేములవాడ ఫంక్షన్‌హాళ్లలో ప్లాస్టిక్‌ను నిషేధించాలని మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు అధ్యక్షతన మే 30న తీర్మానించారు. పలు ఫంక్షన్‌హాళ్లలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ.. స్టీల్‌ పాత్రలు వాడుతున్నారు. జూట్‌ బ్యాగులతో ఉపాధి, ప్లాస్టిక్‌ను నిషేధించిన గ్రామాలపై సండే స్పెషల్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement