జిల్లా కేంద్రంలోని నూతన గ్రంథాలయ భవనం తుది మెరుగులు దిద్దుకుంటోంది. భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా, త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు విజ్ఞానం, శాస్త్ర సాంకేతికతపై అవగాహన కల్పించేలా భవనం గోడలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. పుస్తకాలు చదువుతున్న విద్యార్థుల చిత్రాలు, పుస్తకాల వరుసలు, అంతరిక్షం, గ్రహాలు, విజ్ఞానానికి సంబంధించిన బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. – కరీంనగర్‌కల్చరల్


