చొప్పదండి: పట్టణ శివారులో నిర్మించిన వంద పడకల ఆస్పత్రి వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో ఆస్పత్రిని పరిశీలించడానికి బీఆర్‌ఎస్ నాయకులు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. బీఆర్‌ఎస్ నాయకులు గేటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నింగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. రవి శంకర్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో వందపడకల ఆస్పత్రి పనులను ప్రా రంభించామని, కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులోకి తేవడంలో ఆలస్యం చేస్తోందని విమర్శించా రు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే ఆసుపత్రిని ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఏనుగు రవీందర్‌రెడ్డి, వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, బత్తిని సంపత్‌గౌడ్, గంగారెడ్డి, రవీందర్ పాల్గొన్నారు.


