విధులు ముగించుకుని వెళ్తుండగా ఢీకొన్న లారీ | - | Sakshi
Sakshi News home page

విధులు ముగించుకుని వెళ్తుండగా ఢీకొన్న లారీ

Jul 9 2026 6:59 AM | Updated on Jul 9 2026 6:59 AM

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్‌ చౌరస్తావద్ద లారీ ఢీకొన్న ప్రమాదంలో రాఘవాపూర్‌ పీహెచ్‌సీలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్న ధనలక్ష్మి (38) మృతిచెందింది. బుధవారం విధులను ముగించుకుని భర్త బోసెల్లి సురేశ్‌తో కలిసి స్కూటీపై వస్తుండగా కరీంనగర్‌ వైపు వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై నుంచి కిందపడ్డ ధనలక్ష్మి నడుముపై నుంచి లారీ వెళ్లడంతో మృతిచెందింది. ఆమె భర్త స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్సై నరేశ్‌ పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ధనలక్ష్మికి యశస్వి, ఆధ్యశ్రీ కూతుళ్లు ఉన్నారు. మృతురాలి సోదరుడు కుక్క సతీశ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన నల్లగొండ జిల్లా హనుమంతులపల్లికి చెందిన డ్రైవర్‌ శ్రీశైలంపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై వివరించారు.

అక్కడికక్కడే స్టాఫ్‌నర్స్‌ మృతి

గాయపడిన భర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement